యాదాద్రి: కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

84చూసినవారు
యాదాద్రి: కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో కొలువైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గుట్టపై బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం స్వామివారికి విష్వక్సేన ఆరాధన, పుణ్యహ వచనము ,యాగశాల ప్రవేశము, చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ట ద్వారాతోరణ, ధ్వజకుంభ ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి సల్వాది మోహన్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్