సూర్యాపేటలో అర్ధరాత్రి దొంగల హల్ చల్
సూర్యాపేట పట్టణంలో అర్ధరాత్రి దొంగల హల్ చల్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఏకంగా రెండు ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని బాలాజీ నగర్ కాకతీయ స్కూల్ పక్కన ఇంట్లో చోరీ చేసి రూ. 60 వేల నగదు, శ్రీరామ నగర్ లో మూడు తులాల బంగారం, మరో ఇంటిలో రూ.6 వేల నగదు స్వాహా చేశారు. అలాగే కిరాణం షాప్ లో, మరో రెండు ఇండ్లలో చోరీ చేశారు. మరో ఇంట్లో ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టి 2 తులాల బంగారు ఆభరణాలు, రూ.60 వేల నగదు దొచుకుపోయారు.