హమాస్ రాజకీయ విభాగం అధిపతిగా యహ్యా సిన్వర్ (61) నియమితులయ్యారు. స్వతంత్ర పాలస్తీనా కోసం పోరాడుతున్న హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియే జులై 31న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన వారసుడిగా యహ్యా సిన్వర్ కొనసాగనున్నారని హమాస్ మంగళవారం ప్రకటించింది. హమాస్‌లో ప్రముఖ వ్యక్తి అయిన సిన్వర్ 2017 నుండి గాజా గ్రూప్‌లో కొనసాగుతున్నారు.