బరువు తగ్గడానికి మీరు ప్రతిరోజూ 30- 45 నిమిషాలు నడవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ అరగంట పాటు వేగంగా నడవడం ద్వారా, మీరు సులభంగా బరువు తగ్గుతారు. మొదటి రోజు అంత సేపు కంటిన్యూగా నడవకండి. ఇది మిమ్మల్ని బాగా అలసిపోయేలా చేస్తుంది. 15 నిమిషాల మార్నింగ్ వాక్ ప్రారంభించి క్రమంగా అర్థగంట సేపు నడవడం అలవాటు చేసుకోండి. ఇలా ప్రతి రోజు చేస్తే ఒక నెలలో మీలో మార్పు కనిపిస్తుందని నిపుణులు తెలిపారు.