KGF3, ‘రామాయణ’పై కన్నడ ప్రముఖ నటుడు యశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నటిస్తున్న టాక్సిక్ 2025 ఏప్రిల్ 10న విడుదల ఆలస్యం కావచ్చు అన్నారు. రామాయణ ప్రాజెక్టులో రావణుడిగా నటిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక KGF3 ఉండొచ్చన్నారు. ఈ మూవీ చేసే ఆలోచన ఉందని, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఇదివరకే చర్చించినట్లు యశ్ తెలిపారు.