గెలిచిన 100రోజుల్లోగా పసుపు బోర్డు పనులు: మోదీ

64చూసినవారు
గెలిచిన 100రోజుల్లోగా పసుపు బోర్డు పనులు: మోదీ
TG: పసుపు బోర్డు ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. 'ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తాత్కాలికంగా పనులపై ప్రభావం పడింది. మేం అధికారంలోకి రాగానే తొలి 100రోజుల్లోనే పసుపు బోర్డు పనుల్ని ప్రారంభిస్తాం. దేశంలో పసుపు రంగానికి ప్రోత్సాహం అందించేలా ఈ బోర్డు పనిచేస్తుంది. పసుపు ఉత్పత్తిపై పరిశోధన, దాని వినియోగంలో వృద్ధి వంటి పలు అంశాలపై కృషి చేస్తుంది' అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్