మోదీ 3.0 క్యాబినెట్‌లో యువ, వృద్ధ తరంగం

57చూసినవారు
మోదీ 3.0 క్యాబినెట్‌లో యువ, వృద్ధ తరంగం
కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీఏ సర్కార్ కొలువు దీరింది. కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో వారిద్దరూ తొలిసారి కేంద్ర మంత్రి పదవులు చేపట్టారు. వారిలో ఒకరు కింజారపు రామ్మోహన్ నాయుడు (36), మరొకరు జీతన్ రాం మాంఝీ(79). కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఇక జీతన్ రాం మాంఝీ కొద్దికాలం బీహార్ సీఎంగానూ, అంతకు ముందు నితీశ్ కుమార్ సర్కార్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.

సంబంధిత పోస్ట్