గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు ప్రియురాలి గొంతు కోశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత అతను గొంతు కోసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ హత్యకు గల కారణాలు తెలియల్సి ఉంది.