సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. భారీ వేగంతో వస్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ బండిపై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో యువకుడు కారు చక్రాల కింద పడ్డాడు. వెంటనే బాటసారులు అతడిని కాపాడారు. అయితే అతను స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.