బిహార్‌లో జరిగిన షాకింగ్ ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో స్టేజీపై డ్యాన్స్ చేస్తున్న ఓ యువతి వద్దకు యువకుడు వచ్చి ఆమె నుదిటిపై సింధూరం అద్ది పెళ్లాడాడు. ఆర్కెస్ట్రా డ్యాన్సర్ అయిన సదరు యువతి ఆ యువకుడి స్నేహితుడి వివాహ వేడుకలో నృత్యం చేసేందుకు వచ్చిన సమయంలో ఇది జరిగినట్లు స్థానిక వార్తా కథనాలు తెలిపాయి.