సినిమా ఇండస్ట్రీలపై ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో సౌత్ కంటే నార్త్ వాళ్లకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారని తెలిపారు. తాను హిందీ మూవీ ఆడిషన్‌కు వెళ్తే హిందీ బాగా మాట్లాడగలనా? లేదా? అని టెస్ట్ చేస్తారు. కానీ, నార్త్ హీరోయిన్లకు లాంగ్వేజ్ రాకున్నా సౌత్‌లో ఛాన్సులొస్తున్నాయని అన్నారు. అక్కడా, ఇక్కడా నార్త్ వాళ్లనే ఎక్కువగా తీసుకుంటున్నారని, అందుకే తనకు తెలుగులో పాత్రలు రావట్లేదని రెజీనా చెప్పుకొచ్చింది.