కులగణనలో ఒక్క తప్పు ఉన్నా చూపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. 'మా సర్వే మొత్తం 5 కేటగిరీలుగా విభజించాం. ముస్లీంలలో ఉన్న బీసీలను కూడా కలిపి చెప్పాం. హిందూ, ముస్లీం బీసీలంతా కలిసి 56 శాతం ఉన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌లపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. ఆ తర్వాత పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం. ఎస్సీ వర్గీకరణ, కులగణనపై మాత్రమే రాహుల్ గాంధీతో చర్చించాను'అని అన్నారు.