స్కూటీపై నుంచి పడ్డ యువతి (వీడియో)

8012చూసినవారు
దేశవ్యాప్తంగా సోమవారం హోలీ సంబరాలు ఆనందోత్సాహల మధ్య జరుగుతున్నాయి. అయితే కొందరు యువతీయువకులు రోడ్లపై పండగ వేళ ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఇదే కోవలో యూపీలోని నోయిడా ప్రాంతంలో రోడ్డుపై ఓ యువతి స్టంట్ చేసింది. స్కూటీ రన్నింగ్‌లో ఉండగా దానిపై నిల్చుని ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో అదుపుతప్పి కింద పడింది. అదృష్టవశాత్తూ చిన్నపాటి గాయాలతో తప్పించుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్