మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులి వెందులలో ‘రాజారెడ్డి ఐ సెంటర్’ను ప్రారంభించారు.రెండు రోజులుగా ఆయన పులివెందులలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేసిన రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం ఐ సెంటర్‌లో స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.