ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బరేలీలోని బరాదరి పోలీస్ స్టేషన్ పరిధి సంజయ్ నగర్
హోలీ కూడలిలో జులై 25 ఓ యువకుడిని ముగ్గురు ఆకతాయిలు దారుణంగా కొట్టారు. అనంతరం అతడిని స్కూటీకి కట్టేశారు. తర్వాత కిలోమీటర్ దూరం బాధితుడిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.