బీహార్‌లో నిరుద్యోగ అభ్యర్థులు మళ్లీ రోడ్డెక్కారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో బీపీఎస్సీ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్ ను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆదివారం కూడా తమ నిరసనను కొనసాగించారు.