రైతులకు నష్టం కలిగించింది వైసీపీనే : మంత్రి అచ్చెన్న

58చూసినవారు
రైతులకు నష్టం కలిగించింది వైసీపీనే : మంత్రి అచ్చెన్న
AP: 'ఐదేళ్ల పాటు రైతులను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ‘మీ పాలనలో రైతులకు రాయితీలు లేవు. ఎరువులు సక్రమంగా అందలేదు. సూక్ష్మ సేద్యం లేదు. వ్యవసాయ యాంత్రీకరణ లేదు. అన్ని రకాలుగా రైతులకు నష్టం కలిగించింది వైసీపీ ప్రభుత్వమే' అని అచ్చెన్న ట్వీట్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్