ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లచ్చీవాలా టోల్ ప్లాజా దగ్గర ఓ ట్రక్ అదుపుతప్పి ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.