TG: మంత్రి కొండా సురేఖ మంగళవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సభ్యుల పదవీకాలం రెండేళ్లుగా నిర్ణయించామని, వీరికి ఎలాంటి జీతభత్యాలు ఉండవని పేర్కొన్నారు. బోర్డుకు బడ్జెట్ మాత్రం ప్రభుత్వమే నిర్ణయిస్తుందని వెల్లడించారు.