కోదాడ లోని రామాలయం పునర్ నిర్మించేందుకు కృషి

157చూసినవారు
కోదాడ లోని రామాలయం పునర్ నిర్మించేందుకు కృషి
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న రామాలయం పురాతనమయినది. ఈ దేవాలయం శిధిలావస్థకు చేరుకోగా, గోడలు కుంగి కూలిపోతున్నాయి ఈ దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ప్రముఖులు, పండితులు, మేధావులు, ప్రజా ప్రతినిధులు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకునేందుకు నాగుబండి రంగా అధ్యక్షతన ఒక సమావేశం కోదాడ అతిథిగృహంలో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేంపల్లి చందర్రావు హాజరయ్యారు. కోదాడ దేవాలయం నూతనంగా నిర్మించేందుకు తన వంతు సహకారం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆర్ అండ్ బి వారితో మాట్లాడి కొంతమేర స్థలాన్ని గుడికి కేటాయించాలని మంత్రిగారికి చెబుతానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్