మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ అనంతపురం లో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పూలే అంటరానితనం, కులవివక్షత పై అలుపెరగని పోరాటం చేసారని అన్నారు. అలాగే బాలికల చదువుకోసం ఎంతో కృషిచేసిన మహనీయుడు అని, వారి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని అన్నారు.