అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం యాడికి రెవెన్యూ అధికారులు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను కలిసి అరటి గెల అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యాడికి తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.