వైయస్ వివేక్ హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్, తండ్రి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తమ ముందస్తు బెయిల్ కండిషన్లను సడలించాలని హైకోర్టును ఆశ్రయించారు. నేడు దీనిపై విచారించింది. ఇందులో వారు తాము జపాన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కోర్ట్ దీన్ని గమనించి సీబీఐ కోర్టుని ఆశ్రయించండి అని తెలిపింది. దీంతో అవినాష్ కి నిరాశ ఎదురైంది.