కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగు రోజుల క్రితం గుర్తుతెలియని మహిళ రైలు కింద పడి చనిపోయింది. మృతురాలి తరుపున బందువులు ఎవరూ రాకపోవడంతో కుప్పం రైల్వే పోలీసులు డికేపల్లి మాజీ సర్పంచ్ మణికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన మణి అనాధ శవానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటికే పలు సందర్భాలలో అనాధ శవాలకు మణి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.