తిరుపతి జిల్లాలోని అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ ప్రమాదంలో సిపాయి లాల్(30) మధ్యప్రదేశ్ వాసి మృతి చెందినట్లు సమాచారం తెలిసిన వెంటనే సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గురువారం మృతుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిగతా క్షతగాత్రులను మెరుగైన వైద్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మృతుడు కుటుంబానికి నష్టపరిహారం కింద యాజమాన్యం నుంచి వచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు.