ఏపీ ప్రజలకు సీఎం జగన్ కీలక పిలుపు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేశామని చెప్పారు. ఎన్నికల్లో వేసే ఓటే రాబోయే ఐదేళ్ల భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు పంపిణీ చేశామన్నారు. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. అవ్వాతాతలు, అక్క చెల్లెళ్లు తనను మళ్లీ ఆదరించాలని సీఎం జగన్ కోరారు.

సంబంధిత పోస్ట్