విద్యార్థులకు శుభవార్త.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

AP: విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలతో సర్టిఫికెట్లు అందక ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. "ఈ ప‌థ‌కాల‌కు వైసీపీ ప్రభుత్వం రూ.3480 కోట్లు బకాయిలు పెట్టింది. డైరెక్ట్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం తొలగించి.. ఈ విధానం అమలు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది. 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయి." అని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్