టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్లు శనివారం తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా అరుదైన ఘనత సొంతం అవుతుంది. విజేతగా నిలిచిన జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ సాధించిన జట్టుగా నిలుస్తుంది. వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా (2003, 2007), వెస్టిండీస్ (1975, 1979) క్రికెట్ జట్లు రెండు సార్లు చొప్పున ఈ ఘనత గతంలో సాధించాయి.