నేడు పులివెందులకు జగన్

ఇవాళ ఏపీ శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తికి అధికార, విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే, స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. మరోవైపు మాజీ సీఎం జగన్ శనివారం పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు.

సంబంధిత పోస్ట్