కల్కి 2898AD సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 'కల్కి సినిమా గురించి అద్భుతమైన రివ్యూస్ వినడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలోని నటీనటులందరికీ కంగ్రాట్యులేషన్స్. భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి ధన్యావాదాలు' తెలిపారు.