కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఏర్పాటు కానున్న EV పార్కు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఒక మైలు రాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పీపుల్ టెక్ గ్రూప్ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఓర్వకల్లు దగ్గర ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్ ఏర్పాటు కానుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని పవన్ పేర్కొన్నారు.