చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నానితో పాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. తనకు భద్రత కల్పించాలని కోరినా పోలీసు శాఖ స్పందించలేదని హైకోర్టులో నాని పిటిషన్ వేశారు. గతంలో హైకోర్టు ఆదేశాలతో 2+2 భద్రత ఇచ్చి ఆ తర్వాత తొలగించారని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు తాజా ఉత్తర్వులిచ్చింది.