పీడీఎస్ బియ్యం అక్రమార్కులపై కేసులు నమోదు చేయండి: మంత్రి నాదెండ్ల

AP: పీడీఎస్ బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయం, పౌర సరఫరాల శాఖల అధికారులతో నేడు ఆయన సమీక్ష నిర్వహించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై నేర తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. 6A కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్