ధర్మవరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో అమరవీరుల వారోత్సవాల్లో సందర్భంగా మూడవరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. పోలీస్ స్టేషన్ కు పొరుగున ఉన్న గ్రామంలోని హైస్కూల్ విద్యార్థులను పిలిపించి, పోలీసుల బాధ్యతలు, విధులు, వివిధ రికార్డులను రాయు తీరు, వివిధ చట్టాల గూర్చి వివరించారు. శాంతి భద్రతలను అదుపులో పోలీసుల పాత్ర అన్న విషయాలను వివరించామన్నారు.