కూలిన విద్యుత్ స్తంభం.. ఎద్దు మృతి

గుత్తి మండలం రజాపురం గ్రామంలో లింగయ్య అనే రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా సోమవారం ప్రమాదవశాత్తు పంట పొలంలోని విద్యుత్ స్తంభం ఒక్కసారిగా నేలకొరిగి ఎద్దు మీద పడింది. దీంతో ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఎద్దుకు తీవ్ర గాయాలు అయ్యాయి. రైతు లింగయ్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న కూలీలు భయంతో పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్