గుత్తి పట్టణంలోని సాయిబాబా ఆలయంలో సోమవారం సాయిబాబా ఆలయ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాము, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ రెడ్డి, మహేశ్, ప్రధాన కార్యదర్శిగా కోనా ప్రదీప్ రెడ్డి, కోశాధికారిగా నారాయణస్వామి, సహాయ కోశాధికారిగా రూపేష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.