ప్రస్తుతం దేశంలో డ్రాగన్ ఫ్రూట్‌కు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో ఈ ప్రూట్ ప్రస్తుతం కేజీ రూ.150-200 వరకు పలుకుతోంది. ఈ తరుణంలో రైతులు దీనిని సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కలకు, సిమెంట్ దిమ్మెలకు అంతా కలిపి ఎకరాకు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒకసారి సాగు చేస్తే 20ఏళ్ల వరకు పంట చేతికి వస్తుండడంతో రూ.లక్షల్లో ఆదాయం పొందొచ్చని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.