సోమందేపల్లి మండల టీడీపీ యువ అద్యక్షుడు కోతుల ప్రసాద్ ఇటీవల కాలుకి చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి సవిత సోమవారం ప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి విచారించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి ప్రసాద్ కు రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందించారు.