TG: వరకట్నం వేధింపులకు ఓ మహిళ బలైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఎన్టీపీసీ ఆటోనగర్‌కి చెందిన నరేందర్, దీప్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఈ క్రమంలో నరేందర్ కట్నం కోసం దీప్తిని వేధించడం ప్రారంభించాడు. దీంతో వేధింపులు తాళలేక ఓ సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకుంది. ‘అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి.. మా ఆయన నిత్యం వేధిస్తున్నాడు. నేను చనిపోతున్నా.. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ వాపోయింది.