గుత్తి పట్టణంలోని సుంకులమ్మ గుడి దగ్గర గల అంగన్వాడి కేంద్రాన్ని సోమవారం అడిషనల్ సిడిపిఓ నాగమణి తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థులకు క్రైమ్ సి ద్వారా బోధన అందించాలని అలాగే బాత్రూమ్ లను శుభ్రంగా ఉంచాలని తెలిపారు.