జక్కసముద్రంలో నూతన భవన నిర్మాణ కమిటీ ఎన్నిక

గోరంట్ల మండల పరిధిలో ఉన్న జక్క సముద్రం, సీనపల్లి గ్రామాలలో.. బుధవారం రాత్రి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు అన్ని విధాల ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రతి గ్రామంలోనూ నూతన కమిటీలు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మిక కమిటీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాసులు, కార్యదర్శి వెంకటరమణ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్