రాయదుర్గం: నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

రాయదుర్గం ఆర్టీసీ డిపోకు కొత్తగా మంజూరైన రాయదుర్గం నుంచి బళ్లారికి వెళ్లే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులను ఎమ్మేల్యే కాలువ శ్రీనివాసులు గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పార్టీ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ నాయకులు, అనుబంధ విభాగాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్