తాడిపత్రి: ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి ముఖ్య కార్యకర్తల సమావేశం

తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో ఆదివారం ఎమ్మార్పీఎస్, ఏం ఎస్ పి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ మాట్లాడుతూ.. నవంబర్ 5వ తేదీన జరగనున్న చలో- అనంతపురం కార్యక్రమానికి మాదిగలు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తాడిపత్రి నియోజకవర్గ ఇంఛార్జ్ ఎం. పెద్దిరాజు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్