యోగి వేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ రాజీనామా

AP: కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ రాం ప్రసాద్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ఉపకులపతి కృష్ణారెడ్డి ఆమోదించారు. కాగా, 10 రోజుల క్రితమే తెలుగు ఆచార్యులు రాం ప్రసాద్‌రెడ్డి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇంతలోనే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

సంబంధిత పోస్ట్