లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, MLC సూరజ్ రేవణ్ణను ఇవాళ కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూరజ్‌ని జడ్జి శివకుమార్ నివాసంలో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి సూరజ్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. సూరజ్ రేవణ్ణ సోదరుడు ప్రజ్వల్ కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.