రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. నుజ్జునుజ్జు అయిన మృతదేహం

సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోదాడ దగ్గర జాతీయ రహదారిపై నిన్న అర్థరాత్రి ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే చీకట్లో మృతదేహం కనిపించకపోవడంతో ఆ హైవే మీదుగా వచ్చిన వాహనాలన్నీ తొక్కుకుంటూ వెళ్లాయి. దీంతో మృతదేహం నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్