ప్రముఖ సినీ నటి గౌతమి బుధవారం అన్నాడీఎంకే పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (EPS) సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని EPS ఇంటికి ఆమె వెళ్లారు. చర్చల తర్వాత ఆ పార్టీలో గౌతమి చేరారు. ఇక ఆమె 2004 నుండి 2016 వరకు నటుడు కమల్ హాసన్‌తో రిలేషన్షిప్లో ఉన్నారు. తర్వాత ఆయనతో విడిపోయారు. ఇటీవల బీజేపీకి ఆమె రాజీనామా చేశారు.