యూపీలోని ఔరయ్యా సదర్ కొత్వాలి ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలిక స్కూల్కు వెళ్తుండగా దుండగుడు ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఆమెను బలవంతంగా బైక్ ఎక్కించేందుకు విఫల యత్నం చేశాడు. అయితే బాలిక అతడి నుంచి తప్పించుకుని పరుగులు తీసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బైక్ నంబరు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.