అహ్మదాబాద్‌లోని మోదసా హైవేపై మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ బైకర్ రోడ్డుపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే ఆ బైకర్ యూటర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. బైకర్‌ను ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు చక్రాల కింద నలిగి ఆ బైకర్ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.