లోక్ సభ ఫలితాల్లో బీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 23 శాతం బిఆర్ఎస్ ఓట్ షేర్ తగ్గింది. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును కూడా బీఆర్ఎస్ కోల్పోయింది.